Saturday, March 14, 2026

*అదనంగా బస్సు సౌకర్యం కల్పించాలి*

నేటి సాక్షి (జిన్నారం) సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారం నుంచి మియాపూర్ వరకు ఆదనంగా బస్సు సర్వీసులు నడపాలని విద్యార్థులు స్థానికుల ఆందోళన నిర్వహించారు ఐడిఏ బొల్లారం పారిశ్రామికవాడ నుంచి ఉదయం సమయంలో అదనంగా బస్సు సర్వీసులు నడపాలని విద్యార్థులతో కలిసి స్థానికుల ఆందోళన నిర్వహించారు. ఉదయం సమయంలో కేవలం మూడు బస్సులు మాత్రమే రావటడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోయారు. విద్యార్థులు, వ్యాపారులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారని తెలిపారు. ఆర్టీసీ అధికారులు రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉదయం సమయంలో నడిచే బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. అకస్మాత్తుగా ధర్నాకు దిగడంతో పోలీసులు సమస్య పరిష్కారం కోసం ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News