నేటి సాక్షి, గన్నేరువరం,( బుర్ర అంజయ్య గౌడ్):* గన్నేరువరం మండల కేంద్రం నుండి పొత్తూరు వరకు డబల్ రోడ్డు నిర్మాణం చేసి ప్రజల కష్టాలు తీర్చాలని బిజెపి స్టేట్ మాజీ కౌన్సిల్ మెంబర్ విలాసాగరం రామచంద్రం అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గుండ్లపల్లి నుండి గన్నేరువరం మీదుగా పొత్తూరు వరకు అద్వాన స్థితిలో ఉన్న రోడ్డు తో ప్రయాణికులకు వాహనదారులకు యమ పాశం లాగా మారింది. వెంటనే డబుల్ రోడ్డు పనులు చేపట్టి రోడ్డు మొత్తం పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో ప్రభుత్వానికి భారీ గుణపటం తప్పదని హెచ్చరించారు.





