నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 18 ఆనాధ పిల్లలే కదా అడిగేవారెవరులే అనుకొన్నాడా నిర్వాహకుడు… అన్యం పుణ్యం తెలియని అరచెయ్యిని పగులగొట్టేశాడు… ఇంకేమి చేస్తాడో అన్న భయంతో వేసుకొన్న నిక్కరుతోనే సొంత గ్రామానికి చేరుకున్నాడా బాలుడు…బాలుడి కథనం మేరకు…చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పంచాయతీ కేంద్రం పుదిపట్లలో సంజోత్ అనే ఆశ్రమాన్ని నిరంజన్రెడ్డి అనే అతను నడుపుతున్నాడు.కుటుంబంలోని తల్లిదండ్రులు, ఎవరో ఒకరిని కోల్పోయిన వ్యక్తుల పిల్లలు, చదువుకొనే స్థోమత లేని పిల్లలు ఈ ఆశ్రమంలోకి చేరదీస్తున్నారు.ఈక్రమంలో చిత్తూరు సంతపేటకు చెందిన ప్రకాష్ కుమారుడు ఆదిత్య(13) ఇదే ఆశ్రమంలో వున్నాడు. ఇక్కడే వుంటూ వుదిపట్ల ఉన్నతపాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. గత రెండు రోజులుగా బాలుడు పాఠశాలకు రాకపోవడంతో ప్రధానోపాధ్యాయురాలు పద్మజ ఆరా తీసింది. నిర్వాహకుడు నిరంజన్రెడ్డిని మా ప్రతినిధి చరవాణిలో విచారించే ప్రయత్నం చేయగా అతని నుంచి దురుసుగా సమాధానం రావడంతో జరిగిన ఉదంతం బయటకు వచ్చింది.ఆశ్రమంలో ఆనాధ పిల్లలచేత పశువులు, కోళ్ళను మేపించడం,వాటి వ్యర్థ పదార్థాలను ఊడిపించడం వంటి కార్యక్రమాలను చేయిస్తున్నాడనీ,పిల్లలు ఒప్పుకోకుంటే దారుణంగా బాదుతున్నాడని ఆదిత్య సామాజిక మాద్యమం ద్వారా వివరించాడు.తనను కోళ్ళవ్యర్థ పదార్థాలు తీయలేదని చితకొట్టాడనీ, చెయ్యి అడ్డు పెడితే పగిలేలా ఇనుప ఊచతో కొట్టగా భరించలేక పారిపోయి వచ్చేశానని మాద్యమంలో తెలిపాడు.తాను వేసుకొన్ని నిక్కరుతోనే సొంత గ్రామానికిచేరుకొన్నానని తెలిపాడు. తనతోపాటు అక్కడున్న పిల్లలకు ఇదే పరిస్థితి వుందనీ, వారందరినీ ఆదుకోవాలని వాట్సాఫ్ ద్వారా సమాచారాన్ని వ్యక్త పరచాడు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.ఈ విషయం తెలిసిన ఐసిడియస్,సిడబ్యూసి అధికారులు విచారణ చేపట్టారు.ఈ విషయం పైన బాదితుడి తల్లి సుదా ఇచ్చిన పిర్యాదు పైన చౌడేపల్లి పోలీసులు కేసు నమోదుచేసినట్లు ఎస్సై నాగేశ్వరావు తెలిపారు.





