నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లిస్థానిక బస్టాండ్ లో ఓ మహిళ మరణించడంతో పంచాయతీ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు లక్ష్మీదేవి 55 అనే మహిళ గత ఐదు సంవత్సరాలుగా భిక్షాటన చేసుకుంటూ జీవిస్తోంది ఈ క్రమంలో ఆమె అనారోగ్యం పాలు కావడంతో స్థానిక ఆర్టిసి బస్టాండ్ లో తలదాచుకుంటూ ఉండేది ఈ క్రమంలో సోమవారం ఉదయం బస్టాండ్ లోనే మృతి చెందింది గుర్తించిన చుట్టుపక్కల వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు పంచాయతీ కార్యదర్శి జాకీర్ హుస్సేన్ వీఆర్వో విఆర్ఓ విజయ్ కుమార్ రెడ్డి ల ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించారు





