నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్): చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన కొమ్ము చరణ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. చరణ్ మృతితో అతని కుటుంబం తీవ్ర మనోవేదనకు లోనైంది. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. చరణ్ డిగ్రీ చదువుతున్న రోజుల్లో సన్నిహితంగా ఉన్న మిత్రులు ఈ విషాద సమయంలో కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేశారు. మిత్రులు స్వచ్ఛందంగా విరాళాలు సమీకరించి, కుటుంబానికి అందజేశారు. స్నేహబంధం ఏ స్థాయిలో ఉండాలో చూపించిన ఈ చర్య మానవతా విలువలకు నిదర్శనంగా నిలిచింది.





