( నేటి సాక్షి) బండ్లగూడ జాకీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బండ్లగూడ గ్రామంలో అక్రమ నిర్మాణదారులు రెచ్చిపోయి అదనపు అంతస్తులను అక్రమ నిర్మాణాలను యదేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. కార్పొరేషన్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అదనపు అంతస్తులు యదేచ్చగా నిర్మిస్తున్నారు. అక్రమ నిర్మాణదారుల నుంచి టౌన్ ప్లానింగ్ భారీ ముడుపుల అందుకోవడంతో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నరనే విమర్శలు వెలువెత్తుతున్నాయి.టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణదారుల నుంచి అందిన కాడికి ముడుపులు అందుకొని అక్రమ నిర్మాణదారులకు అండగా నిలుస్తున్నారని విమర్శలు ఉన్నాయి. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు బిల్డర్లు వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడి ఒక్కో బిల్డర్ నుంచి లక్షలాది రూపాయలు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. అవినీతికి అక్రమాలకు పాల్పడుతున్న టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు తమను ఎవరేం చేస్తారో అనే ధీమాతో ఉన్నతాధికారులను కూడా మచ్చిగా చేసుకొని వాటాలు అందుకుంటున్నారని బహిరంగ విమర్శలున్నాయి. గత కొన్ని రోజుల క్రితం నార్సింగి పురపాలక సంఘం పరిధిలో టౌన్ ప్లానింగ్ విభాగం అధికారిని లక్షలాది రూపాయలు వసూళ్లకు పాల్పడి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కినగాని బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు యదేచ్చగా వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నత అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలని, అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.





