నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*రామచంద్రాపురం*మండలంలోని బాణాసంచా విక్రయ కేంద్రాల్లో అనుమతులు లేకుండా ఎవరైనా బాణసంచా విక్రయాలు చేస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ భక్తవత్సలం అన్నారు బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై పాత్రికేయులతో మాట్లాడుతూ తప్పనిసరిగా లైసెన్స్ దారులు బాణసంచా విక్రయించాలని అన్నారు తల్లిదండ్రుల పర్యవేక్షణలోని తమ పిల్లలు టపాకాయలు పేల్చాలని ఆయన సూచించారు ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలను సేవిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందని అన్నారు ఖచ్చితంగా అగ్నిమాపక సిబ్బందిని కలిసి ఖచ్చితంగా సిలెండర్ లను ఏర్పాటు చేసుకోవాలి దుకాణం దారులు దుకాణానికి నాలుగు వైపులా దారులను ఏర్పరచుకోవాలి సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు




