Friday, March 13, 2026

అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టివేత

నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్):ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను చందుర్తి పోలీసులు గురువారం పట్టుకున్నారు. వాటిని అదుపులోకి తీసుకుని తదుపరి చర్యల నిమిత్తం రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు చందుర్తి ఎస్ఐ జె. రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చందుర్తి మండలం మర్రిగడ్డ నుండి దేవునితండా వైపున ఎస్ఐ జె. రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జోగాపూర్ గ్రామ శివారులో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను గుర్తించారు. ట్రాక్టర్ డ్రైవర్లు అణుగుల దేవరాజ్ మరియు రత్నం సంజీవ్ లకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకపోవడంతో, పోలీసులు తక్షణమే ఆ ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మట్టి తరలింపుపై తగిన చర్యలు తీసుకునేందుకు వాటిని సంబంధిత రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు ఎస్ఐ రమేష్ వెల్లడించారు. అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై నిఘా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News