నేటి సాక్షి;, మిర్యాలగూడ : పట్టణంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలకు వ్యతిరేకంగా, నిర్వహిస్తున్న ఐదు ప్రయివేటు పాఠశాలపై పిర్యాదు అందగా, వాటిపై ఆ పాఠశాలలకు నోటీసులు అందజేసినట్లు ఎంఈఓ బాలు నాయక్ తెలిపారు. బుధవారం పట్టణంలోని ఎంఈఓ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలకు వ్యతిరేకంగా, నిర్వహిస్తున్న ఐదు ప్రయివేటు పాఠశాలపై పిర్యాదు అందగా, వాటిపై ఆ పాఠశాలలకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. సోమవారం వరకు వారికి అవకాశం కల్పించామని, లేని పక్షంలో ఆ పాఠశాలలను ప్రభుత్వ నిబంధనల మేరకు సీజ్ చేస్తామని తెలిపారు.అలాగే నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు, నాట్ బుక్స్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేటు పాఠశాలలో విద్యార్థుల ఫీజ్ ల వివరాలు, స్టాఫ్ వివరాలు నోటీస్ బోర్డ్ లో ఉంచాలని, ఇష్ట రాజ్యాంగ ఫీజులు వసూలు చేస్తే, ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

