వ్యవసాయం మోటార్లను టార్గెట్ చేస్తున్న దుండగులు
- మండలం ప్రజలకు సూచనలు చేసిన సీఐ హరికృష్ణ
నేటి సాక్షి ;కమలాపూర్ (నాగరాజు పటేల్ ఎడ్ల)
హనుమకొండ జిల్లా కమలాపూర్ లోని గత కొంతకాలంగా గుర్తు తెలియని దుండగులు వ్యవసాయ భూముల వద్ద ఉన్న మోటార్ల దొంగతనాలు జరుగుతున్న సందర్భంగా కమలాపూర్ మండల ప్రజలకు మరియు రైతులకు సీఐ ఈ హరికృష్ణ పలు సూచనలు చేశారు. మండలంలోని పలు గ్రామాలలో ఉన్నటువంటి వ్యవసాయ బావులు,వాగులు,ఎస్సారెస్పీ కెనాల్ వద్ద ఉన్నటువంటి మోటార్ కాపర్ వైర్ల కోసం కొంతమంది దుండగులు టార్గెట్ చేస్తూ మోటార్లను ధ్వంసం చేసి కాపర్ వైర్లు అపహరించుకొని వెళుతున్నారని కావున సమస్త రైతులు ఈ విషయాన్ని గమనించి అప్రమత్తంగా ఉండి ప్రస్తుతం వ్యవసాయ పనులు లేనందున మోటార్లను భద్రపరుచుకోవాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా మండలంలో వ్యవసాయ పొలాలు వాగులు,ఎస్సారెస్పీ కెనాల్ కాలువల వద్ద అనుమానస్పద స్థితిలో ఎవరైనా వ్యక్తులు కనిపిస్తే పోలీస్ స్టేషన్ కి లేదా100 కి కాల్ చేసి సమాచారం అందించాల్సిందిగా సీఐ మండల ప్రజలను కోరారు.

