నేటి సాక్షి,నల్లబెల్లి ప్రతినిధి అక్టోబర్ 16 : అన్నదమ్ముల మధ్య గొడవ ఒకరి ప్రాణం తీసిన సంఘటన కొండాపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై వి.గోవర్ధన్ తెలిపిన వివరాలు ప్రకారం నల్లబెల్లి మండలం కొండాపురం గ్రామానికి చెందిన మేరగుత్తి మల్లయ్య- సమ్మక్క దంపతులకు ఇద్దరు కుమారులు రమేష్,సురేష్ ఇద్దరూ అన్నదమ్ములు బుధవారం రాత్రి 08:00 గంటల సమయంలో మేరగుత్తి రమేష్ తన తల్లి సమ్మక్కతో ఇంటి జాగా పంచిఇవ్వమని తల్లితో గొడవ పడుతుండగా. అదే సమయంలో రమేష్ తమ్ముడు అయినా మేరగుత్తి సురేష్ అమ్మతో ఎందుకు గొడవ పడుతున్నావు అంటూ,నేను నీకు ఇచ్చిన 10000 సరిపోవా ఎందుకు అమ్మను ఇబ్బంది పెడుతున్నావు అంటూ. ఇట్టి విషయాన్ని మనసులో పెట్టుకొని నీకెందుకు ఇంటి జాగా పంచివాలంటూ అన్నతో గొడవ పడుతు అదే సమయంలో సురేష్ కోపంతో ఉద్దేశపూర్వకంగా ఇంట్లో ఉన్న కత్తితో తన అన్నయ్య రమేష్ పొట్టలో, వీపులో పొడవగా అదే సమయంలో అక్కడున్న రమేష్ భార్య స్వరూప ఆపగ ఆమెను కత్తితో ఛాతీ భాగం లో పొడవగా ఆమెకు తీవ్ర గాయాలు కాగా రమేష్ తో పాటు ఆమెను అతని తల్లి సమ్మక్కను 108 అంబులెన్స్ లో నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదే రోజు రాత్రి సుమారు 10:20 గంటల సమయంలో స్వరూప వయసు( 35)మరణించింది. రమెష్ ప్రస్తుతం ఎంజీఎం హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంలో స్వరూప కొడుకు అయిన శివకుమార్ దరఖాస్తు ఇవ్వగా మేరగుత్తి సురేష్ పై ఎఫైర్ నమోదు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామంటూ ఎస్ఐ గోవర్ధన్ తెలిపారు.




