Thursday, March 19, 2026

*అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం రైతులకు రెండో విడత జమ** రైతు పక్షాన నిలబడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం:మంత్రి కొలుసు పార్థసారధి * రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది* ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ *

నేటి సాక్షి, బాపట్ల జిల్లా (బాపట్ల రూరల్)రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని ఎందుకే రైతులుకి కష్టం లేకుండా చేయడమే లక్ష్యంగా కుటుంబ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.బాపట్ల మండలం ఈస్ట్ బాపట్ల రైతు సేవ కేంద్రం వద్ద అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద రైతులకు రెండో విడత ఆర్థిక సహాయం పంపిణి కార్యక్రమంలో అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇంచార్జి మంత్రి మరియు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారధి , బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వాసుదేవ వినోద్ కుమార్ తో కలిసి బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పాల్గొన్నారు. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అభివృద్ధి కొరకే టిడిపి కూటమి ప్రభుత్వం పని రైతులకు ఏ కష్టం లేకుండా అహర్నిసులు రైతుల పక్షాన నిలబడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని అన్నారు.తదుపరి ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అని అన్నారు. రాష్ట్రంలోని 46.86 లక్షలమంది రైతన్నలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఒక్కో రైతు బ్యాంక్ అకౌంట్ లో రెండో విడత రూ.7వేలు జమ అవుతాయని తెలిపారు. ఈ ఏడాది ఆగస్ట్ 2వతేదీన తొలి విడత నిధులు విడుదల కాగా, రెండో విడత నిధులను రైతన్నల ఖాతాలకు బదిలీ చేయడం జరుగుతుందని అన్నారు. రైతుల తలసరి ఆదాయం పెంచడమే కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని అన్నారు. సాగు భూమి ఉన్న ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవం పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు, కేంద్ర ప్రభుత్వం రూ.6 వేలు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జయప్రకాష్ నారాయణ, ఎంపీడీవో ఎమ్మార్వో ,సచివాలయం సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News