నేటి సాక్షి, కోరుట్ల టౌన్* (గణేష్ గొల్లపల్లి)’సనాతన ధర్మ ప్రచార సమితి’ ఆధ్వర్యంలో ‘అన్నపూర్ణ అమావాస్య అన్న ప్రసాద సేవ’లో భాగంగా ఆశ్వయుజ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోరుట్ల అయ్యప్పగుట్ట శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదట అన్నపూర్ణ మాతకు, తదుపరి గోమాతకు పూజలు నిర్వహించి, అన్నప్రసాద వితరణ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 1100 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకతగా, పర్యావరణ హిత దృక్పథంతో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించి స్టీల్ ప్లేట్లు, గ్లాసులు వాడటం జరిగింది. కార్యక్రమానికి సుమారు 350 మంది సభ్యులు సమిష్టి సహకారం అందించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతీ అమావాస్య రోజున పట్టణంలోని వివిధ కూడళ్లలో ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం కొనసాగుతుందని, ఈ సత్కార్యం ద్వారా పితృదేవతల అనుగ్రహం లభించి, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తున్నాం” అని పేర్కొన్నారు.“అన్నదానం మహాదానం” అనే సూత్రాన్ని ఆచరణలో పెడుతూ, భక్తి, సేవా భావం, పర్యావరణ పరిరక్షణల సమ్మిళితంగా ఈ కార్యక్రమం కోరుట్లలో ఆదర్శప్రాయంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో సనాతన ధర్మ ప్రచార సమితి అధ్యక్షులు మంచాల జగన్, ప్రధాన కార్యదర్శి బట్టు హరికృష్ణ, అన్నపూర్ణ అన్నప్రసాద సేవ చైర్మన్ వనపర్తి చంద్రమోహన్, కన్వీనర్ గంప శివకుమార్, నిర్వాహకులు మంచాల రమేష్, పల్లెర్ల మహేందర్, కట్కం రంజిత్, సాడిగే మహేష్, మంచాల రాజలింగం, శ్రీపతి రమేష్, మరియు సేవలో భాగంగా ఆడెపు నరేష్,దాసరి నరేష్, గ్యాదె సాయికృష్ణ, వనపర్తి లింగయ్య, నల్ల లక్ష్మీ నారాయణ,ఎలిమి శంకర్, వనపర్తి ఆంజనేయులు, తాటికొండ కృష్ణప్రహ్లాద్, లింగమూర్తి, చెన్న రవి, తడుక రాజు,మహేష్, కొత్త గణేష్ ,లోకేష్, నవీన్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.





