బుద్దిని తల నరికిన ఉన్మాద దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులపై దేశద్రోహం కేసు నమోదు చేయాలి
ఈనెల 28న మదనపల్లిలో దక్షిణాది రాష్ట్రాల ఇండియా కూటమి నాయకులతో జైల్ భరో నిర్వహిస్తాం
*రాయచోటి ప్రజా సంఘాలు పిలుపు*
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
తధాగతుడు గౌతమ బుద్ధుని తల నరికిన ఉన్మాద దుర్ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి నిందితులపై దేశ ద్రోహం నమోదు చేసి,
కుల వివక్షతో బౌద్ధులను అవమానించి – దురుసు ప్రవర్తనతో దళిత నేతల్ని గాయపరచి , బాధితులపై తప్పుడు కేసులు నమోదు చేయించిన అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పై అట్రాసిటీ కేసు నమోదు చేసి ఎస్పీ ని సస్పెండ్ చేయాలని రాయచోటిలో ప్రజా సంఘ నాయకులు డిమాండ్ చేశారు. నేడు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో సిపిఐ కార్యాలయం లో భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలకుంట శ్రీనివాసులు అధ్యక్షతన పలు ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రామాంజనేయులు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర కార్యదర్శి టి .ఈశ్వర్ , పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి రవిశంకర్ ,భారతీయ అంబేద్కర్ సేన కేంద్ర కమిటీ సభ్యులు కె. వి రమణ, బహుజన సేన వ్యవస్థాపకులు శ్రీ చందు లు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం అంకి శెట్టిపల్లి గ్రామంలో ఉన్న బుద్ధుని కొండపై ఇటీవల గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఉన్మాద ఉద్ఘటనపై సకాలంలో మదనపల్లె తాలూకా సిఐ కళా వెంకటరమణ నిర్వాహకుల ఫిర్యాదు స్వీకరించకుండా కేసును నీరుగాచేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బుద్ధ అంబేద్కర్ సమాజ్ ఫౌండర్ పిటీఎం శివప్రసాద్ మరియు బౌద్ధులు శాంతియుతంగా దమ్మ దీక్ష చేస్తుండడంతో అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అప్రజాస్వామికంగా వ్యవహరించి బుద్ధుని తల నరికి, తల -మొండెం వేరు చేసిన మతోన్మాదుల్ని గుర్తించి, అరెస్టు చేయడం పక్కన పెట్టి, బుద్ధుని తల నరికిన ఉన్మాదంపై నరోడ్డుకు సంబంధం లేకుండా శాంతియుతంగా డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం ముందు దీక్ష చేస్తున్న వారిని అరెస్టు చేయడానికి పెద్ద సంఖ్యలో పోలీసులను పంపించడాన్నీ వీరు తప్పు పట్టారు . దీక్షకు నాయకత్వం వహించిన బౌద్ధ ఉపాసకులు పీటీయం శివప్రసాద్ ను వెంటనే అరెస్టు చేసి, దీక్ష శిభిరం ధ్వంసం చెయ్యమని ఆదేశాలు ఇవ్వడం దీంతో రెచ్చిపోయిన పోలీసులు శివప్రసాద్ గారిని రిక్వెస్ట్ మీద వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఎస్సై ఛాంబర్ లో నిర్బంధించి శివప్రసాద్ పట్ల దురుసుగా ప్రవర్తించగా ఆయన అస్వస్థతకు లోనై గుండెపోటు రావడంతో కనికరం కూడా లేకుండా వారిపై ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడం అప్రజాస్వామీక చర్య అని వీరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల పిటిఎం శివప్రసాద్ కోలార్ ఆసుపత్రి లో హార్ట్ సర్జరీ చేసుకున్నారు.శివ ప్రసాద్ అనారోగ్య సమస్యకు పోలీసు డిపార్ట్మెంట్ నైతిక బాధ్యత వహించి ప్రజా ఉద్యమకారులపై అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలని వీరు కోరారు.
అన్నమయ్య జిల్లాలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పౌర హక్కుల్ని గాలికొదిలేసి, తన సొంత రాజ్యాంగం అమలు చేస్తున్నారని ,ఏ జిల్లాలోనూ లేని అప్రజాస్వామిక విధానాలు ఇక్కడ అమలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుండడంతో ఎస్పీ అమలు చేస్తున్న అప్రజాస్వామిక విధానాలను ప్రశ్నించినందుకు దళితులపై ఆయన ఆగ్రహం పెంచుకొని , బౌద్ధ విశ్వాసులపై స్థానిక పోలీసుల ద్వారా తప్పుడు కేసులు కట్టించి భౌతికంగా హింసించిన అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పై అట్రాసిటీ కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు.
భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లం తాతయ్య మాట్లాడుతూ ఈనెల 28వ తేదీన మదనపల్లి పట్టణంలో జైల్ భరో కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి వీసీకే పార్టీ జాతీయ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు తోల్ తిరుమా వలవన్ తో పాటు తెలంగాణ ,కర్ణాటక ,తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని ఇండియా కూటమి మంత్రులు, ఎంపీలు హాజరవుతున్నారని కావున జిల్లాలోని ప్రజాస్వామిక వాదులు , బహుజన వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు .
పౌర హక్కుల సంఘం జిల్లా నాయకులు వంగిమల్ల రమణ , లాయర్ రెడ్డయ్య ,బాస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎం .వి రమణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకురాలు పద్మావతి, బాస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్యాల మోహన్ , బంజారా సంఘం జాతీయ నాయకులు శంకర్ నాయక్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గౌస్ బాషా, రజక సంఘం జిల్లా నాయకులు రమేష్, శ్రీనివాసులు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు సుధీర్, విద్యార్థి నాయకులు కోటేశ్వరరావు లు మాట్లాడుతూ ఈనెల 28న చలో మదనపల్లి జరిగే జైల్ భరో కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేశారు.