(నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం అక్టోబర్ 14:)*రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గము బాలాపూర్ మండల కేంద్ర ంలో బడంగ్ పేట కార్పొరేషన్ లో మాజీ కార్పొరేటర్లు ఇంకా పెత్తనం చెలాయించటంపై మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇవాళ తుక్కుగూడ కార్యాలయంలో శ్రీ సప్తగిరి కాలనీ వాసులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్, గుడికి దారి గురించి చర్చించారు. సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ సహా ఇతర అధికారులను కేఎల్ఆర్ కోరారు.ఏ సమస్యలు ఉన్నా… అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కాలనీవాసులకు కేఎల్ఆర్ సూచించారు. మాజీ కార్పొరేటర్ల పెత్తనం, వసూళ్లు చేస్తే పోలీసులు, అధికారులకు కంప్లైట్ చేయాలని లక్ష్మారెడ్డి చెప్పారు.త్వరలోనే సప్తగిరి కాలనీని సందర్శించి సమస్యలు తెలుసుకుంటానని కిచ్చెన్న హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో శ్రీ సప్తగిరి కాలనీ వాసులు సహా బడంగ్ పేట కార్పొరేషన్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.





