నేటి సాక్షి మార్చి 10 ఆత్మకూరు:- ఆత్మకూరు మండల విద్యాశాఖ పరిధిలోనీ, కృష్ణాపురం గ్రామ ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలలో మహిళా మణులు అన్ని రంగాలలో ముందడుగు వేశారని పి ఆర్ టి యు. నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాష, తెలిపారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.మనోరంజని ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా మండల విద్యాధికారి మేరీ మార్గరెట్, గర్ల్ హైస్కూల్ హెడ్ మాస్టర్ ఉమారాణి, వెంకటాపురం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.లలిత కుమారి పాల్గొన్నారు.ఈ సందర్భముగా పిఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాష మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం వారికి విద్య, సమానత్వం, గౌరవం, రక్షణ కల్పించాలని. స్త్రీ యెక్క అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలని తెలిపారు.ఈ సందర్భంగా పి ఆర్ టి యు తరపున మహిళా ఉపాధ్యాయులకు శాలువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి, మెమొటోలు చేతికి అందించి ఘనంగా సన్మానించారు.అనంతరం మాట్లాడుతూ పి ఆర్ టి యు మహిళ ఉపాధ్యాయుల కోసం 5 ప్రత్యేక సెలవులు, పిల్లల వయస్సు పరిమితి లేకుండా 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్, మెటర్నిటీ లీవ్ సౌకర్యాలను సాధించిందని ఈ సందర్భంగా తెలిపారు.ఈ సందర్భంగా అతిథులు మహిళల అభ్యున్నతి కోసం మనమందరం పాటుపడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు రాష్ట్ర నాయకులు పి నూర్ మొహమ్మద్, హుస్సేన్ సాహెబ్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఎం చంద్రశేఖర్, ఆత్మకూరు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సి.ప్రదీప్ కుమార్, జి.హనుమంతు, ఉపాధ్యాయులు నూరుల్లా, జనార్ధన్ రావు, శోభన్ బాబు, తదితరులు అన్ని పాఠశాలల నుంచి అధిక సంఖ్యలో మహిళ ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.





