Saturday, March 7, 2026

*అన్ని వర్గాలకు సమాన అవకాశాలు అందాలి** సోషల్ జస్టిస్ డే వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్*

నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించిన సోషల్ జస్టిస్ డే వేడుకల్లో పాల్గొన్న ఆయన, సామాజిక న్యాయం ద్వారా సమానత్వం, సమాన అవకాశాలు, గౌరవప్రదమైన జీవనం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.*సామాజిక న్యాయ దినోత్సవ ప్రాధాన్యం*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చేలా తెలంగాణ ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. అదే ఉద్దేశంతో ఫిబ్రవరి 4ను సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. సామాజిక న్యాయం సమాజానికి బలమైన పునాది అని పేర్కొన్నారు.*సమసమాజ స్థాపనకు సమిష్టి కృషి అవసరం*సోషల్ జస్టిస్ డే సందర్భంగా వివిధ సామాజిక వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలుపరుస్తోందని జిల్లా కలెక్టర్ తెలిపారు. మహనీయులు, పెద్దలు సూచించిన మార్గంలో సమసమాజ స్థాపనకు అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ రాజ్యాంగపరంగా, చట్టపరంగా లభించే హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.*ప్రతిజ్ఞ – ప్రతిభకు ప్రోత్సాహం*అనంతరం సోషల్ జస్టిస్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ అందరిచేత సామాజిక న్యాయ ప్రతిజ్ఞ చేయించారు. తదుపరి వివిధ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థుల ప్రదర్శనలు, కళాజాత బృందం ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి హాజరైన వారిని అలరించాయి.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.ఎస్. లత, బి. రాజ గౌడ్, బీసీ వెల్ఫేర్ అధికారి జి. సునీత, మైనార్టీ అభివృద్ధి అధికారి చిత్రు, జిల్లా ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి అధికారి కె. రాజ్ కుమార్, జిల్లా విద్యాధికారి కె. రాము, వివిధ స్థాయిల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో హకిమ్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.—

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News