నేటి సాక్షి – లక్షెట్టిపేట(రేగుంట ప్రసాద్) నవంబర్ 26 : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని బుధవారం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పాత కొమ్ముగూడెం లో రాజ్యాంగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని వర్గాల అభ్యున్నతికే రాజ్యాంగం పని చేస్తుందని, రాజ్యాంగం రక్షణకు ప్రతి ఒక్కరు పాటు పడాలని, రాజ్యాంగం ద్వారానే సమసమాజం నిర్మాణం సాధ్యమౌతుందని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు దిలీప్ అన్నారు. రాజ్యాంగం ఆమోదం పొందిన రోజును పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందడంతో అందరికీ సమాన హక్కులు అందాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు సృజన్, ప్రసాద్, , ప్రశాంత్, పౌలు, సత్తయ్య, బి. ప్రసాద్, రాజయ్య, వెంకటేష్,అరుణ్,ప్రవీణ్, సోనూ,అనిల్ అంబేద్కర్ అభిమానులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు.





