Wednesday, March 18, 2026

*అపోలో నాలెడ్జ్‌ సిటీలో ప్రీ–క్రిస్మస్‌ వేడుకలు*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)చిత్తూరు, డిసెంబర్‌ 19ః అపోలో నాలెడ్జ్‌ సిటీ విద్యార్థులు శుక్రవారం సాయంత్రం ప్రీ–క్రిస్మస్‌ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. క్రిస్మస్‌ సందడి ప్రతిబింబించేలా క్యాంపస్‌ను ఆకర్షణీయంగా అలంకరించారు. దీపాలు, క్రిస్మస్‌ ఆటపాటలతో వేడుకలు ఆనందోత్సాహాల మధ్య సాగాయి. సంగీతం, క్యారల్స్‌తో క్యాంపస్‌ అంతా పండుగ వాతావరణంతో కళకళలాడింది.ఈ వేడుకలకు ది అపోలో యూనివర్సిటీ వైస్‌–ఛాన్సలర్‌ డా. హెచ్‌. వినోద్‌ భట్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్‌ పండుగ ప్రేమ, కరుణ, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. క్రిస్మస్‌ కేవలం సంబరాల పండుగ మాత్రమే కాకుండా బాధ్యతను గుర్తు చేసే సందర్భమని పేర్కొన్నారు. ప్రతి మనిషిలో మానవత్వాన్ని పెంపొందించే సందేశమే క్రిస్మస్‌ అని, అది సార్వత్రిక విలువలతో నిండి ఉందని తెలిపారు. ఈ క్రిస్మస్‌ నుంచి వచ్చే క్రిస్మస్‌ వరకు అందరి జీవితాల్లో ఆనందం, శాంతి నిరంతరం నిలవాలని ఆకాంక్షించారు.వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన క్రిస్మస్‌ క్యారల్స్‌, సంగీత కార్యక్రమాలు, స్కిట్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శాంటా తాతలు విద్యార్థులకు గిఫ్ట్‌లు అందజేసి పండుగ ఆనందాన్ని రెట్టింపు చేశారు.రిజిస్ట్రార్‌ ప్రొ. ఎం. పోతరాజు, ఏఐఎంఎస్‌ఆర్‌ డీన్‌ డాక్టర్‌ అల్ఫ్రెడ్‌ జె అగస్టీన్, యూనిట్‌ హెడ్‌ ఎస్‌. బాలరాజ్, అధ్యాపకులు, యూనివర్సిటీ అధికారులు ఈ వేడుకల్లో పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. ఆనందం, ఐక్యత, స్నేహభావాల మధ్య ప్రీ–క్రిస్మస్‌ వేడుకలు ఆనందంగా ముగిశాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News