నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)చిత్తూరు, నవంబర్ 15:పర్యావరణ పరిరక్షణకు, క్యాంపస్‌లో పచ్చదనం పెంపొందించేందుకు ది అపోలో యూనివర్శిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్” కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ యూనిట్లు, ఈకో క్లబ్ సంయుక్తంగా ఘనంగా నిర్వహించాయి. యూనివర్శిటీ క్యాంపస్‌లోని వివిధ బ్లాక్ ఆవరణంలోని గ్రీన్ జోన్లో పెద్ద సంఖ్యలో రోజా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వైస్ చాన్సలర్ డాక్టర్ హెచ్. వినోద్ భట్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. పోతరాజు మొక్కలు నాటుతూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన వీసీ వినోద్ భట్ “ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్క నాటి దానిని సంరక్షించాలి. చెట్లు నాటడం మాత్రమే కాదు, వాటిని పెంచడమే అసలైన బాధ్యత. పచ్చదనం పెరగడం వల్ల క్యాంపస్‌లో ఆహ్లాదకర వాతావరణం, ఆరోగ్యకరమైన పరిసరాలు ఏర్పడతాయి” అని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ఒక రోజు కార్యక్రమం కాకుండా, నిరంతర ప్రయత్నం కావాలని, అందులో విద్యార్థులే కీలక పాత్ర పోషించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్లు డాక్టర్ ఎస్. హేమాద్రి రెడ్డి, గాయత్రి, స్టూడెంట్స్ ఎఫైర్ కోఆర్డినేటర్ డాక్టర్ షానీ, ఈకో క్లబ్ సభ్యులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, అధ్యాపకులు, నాన్-టిచింగ్ సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. .





