నేటి సాక్షి తిరుపతి చిత్తూరు, జనవరి 1ః ది అపోలో యూనివర్సిటీ, చిత్తూరులోని స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు గురువారం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా. హెచ్. వినోద్ భట్, రిజిస్ట్రార్ ప్రొ. ఎం. పోతరాజు హాజరై కేక్ కట్ చేసి అధ్యాపకులు, సిబ్బందితో కలిసి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ డా. హెచ్. వినోద్ భట్ మాట్లాడుతూ, నూతన సంవత్సరం అనేది కేవలం క్యాలెండర్ మారడమే కాకుండా, ప్రతి రోజు ఒక నూతన ఆరంభంగా భావించి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అన్నారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదగాలంటే మన ఆలోచనలు, పనితీరు కీలకమని పేర్కొన్నారు. తక్కువ సమయంలోనే అపోలో యూనివర్సిటీ అనేక రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిందని, ముఖ్యంగా బోధన, పరిశోధన, వినూత్న ఆలోచనల రంగాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందని తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకులు అందరూ కలిసి ఒక కుటుంబంలా పనిచేస్తే యూనివర్సిటీ వాతావరణం మరింత సృజనాత్మకంగా మారుతుందని పేర్కొంటూ, వర్క్‌ప్లేస్‌ను ఒక మాతృభూమిలా భావించి అంకితభావంతో పనిచేయాలని ఆయన సూచించారు.రిజిస్ట్రార్ ప్రొ. ఎం. పోతరాజు మాట్లాడుతూ, 2025 సంవత్సరం అపోలో యూనివర్సిటీకి గణనీయమైన ప్రగతిని తీసుకొచ్చిందని తెలిపారు. గత సంవత్సరం జరిగిన కాన్వొకేషన్ కార్యక్రమం అత్యంత విజయవంతంగా పూర్తవడం యూనివర్సిటీ అకడమిక్ ప్రమాణాలకు నిదర్శనమన్నారు. అదేవిధంగా, యూనివర్సిటీకి ఐఎస్‌ఒ సర్టిఫికేషన్ లభించడమే కాకుండా, న్యాక్ గుర్తింపు దిశగా చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. పరిశోధన (రిసెర్చ్) యూనివర్సిటీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ, అధ్యాపకులు, విద్యార్థులు తమ వ్యక్తిగత అభివృద్ధితో పాటు యూనివర్సిటీ వృద్ధికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా. సేతురామ సుబ్బయ్య, స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ డీన్ ప్రొ. కె. భాస్కర్‌రెడ్డి, విభాగాధిపతులు డా. సుచరిత, డా. సత్యనారాయణ, ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

