నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)చిత్తూరు, డిసెంబర్ 01: ది అపోలో యూనివర్సిటీలోని డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి నాలెజ్‌సెంటర్‌లో ఏర్పాటు చేసిన స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డీన్ నూతన కార్యాలయం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. విశ్వవిద్యాలయం అభివృద్ధి – విద్యా పరిపాలనలో నాణ్యత – ఆధునిక వసతుల విస్తరణలో భాగంగా నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కార్యాలయాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన వైస్ ఛాన్సలర్ డాక్టర్ హెచ్. వినోద్ భట్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ది అపోలో యూనివర్సిటీ ప్రగతిలో ఇది మరో ముఖ్య మైలురాయి. టెక్నాలజీ రంగంలో అత్యుత్తమ విద్య అందించాలనే లక్ష్యంతో స్కూల్ ఆఫ్ టెక్నాలజీ నిరంతరం నవ్యపంథాలో ముందుకు సాగుతోంది అని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.పోతరాజు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డీన్ డాక్టర్ జగదీశన్, స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ కె. భాస్కర్ రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సేతురామ సుబ్బయ్య పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.ఫ్యాకల్టీ సభ్యులు, అకడమిక్ కోఆర్డినేటర్లు, పరిపాలనా సిబ్బంది కార్యక్రమానికి హాజరై తమ సంతోషం వ్యక్తం చేశారు. స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అభివృద్ధికి, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి, పరిశోధన-నూతన ఆవిష్కరణలకు ఈ నూతన కార్యాలయం మరింత ప్రోత్సాహం కలిగిస్తుందని వారు తెలిపారు.కార్యక్రమం అనంతరం అతిథులు నూతన కార్యాలయాన్ని పరిశీలించి, ఏర్పాటు చేసిన సదుపాయాలను అభినందించారు.





