Wednesday, March 18, 2026

అప్రమత్తంగా ఉండి నగర ప్రజలకు అందుబాటులో ఉండాలి.**వర్షాల నేపథ్యంలో అధికారులతో సమీక్ష సమావేశంలో మేయర్ డాక్టర్ శిరీష.**తిరుపతి*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ఏర్పడే ఎలాంటి విపత్కర పరిస్థితులలో అయినా నగర ప్రజలకు ఎలాంటి ఆసౌకర్యం లేకుండా చూడాలని అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఏ సమయంలో అయినా అందుబాటులో ఉండాలని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అధికారులను ఆదేశించారు.తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ ఛాంబర్ నందు సంబంధిత అధికారులలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. గత అనుభావుల్ని పరిగణలోకి తీసుకోవాలి. తిరుపతి నగర పరిధిలో గతంలో కురిసిన వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో మళ్ళీ అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకోవాలని .. సంబంధిత ప్రాంతాల్లో ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకున్నారో అధికారాలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖలు సమన్వయం చేసుకుని పనిచేయాలి. వర్షాలు వచ్చినప్పుడు రోడ్లు పై గుంతలు ఏర్పడటం, నీటి ప్రవాహం పెరుగుతున్న సమయంలో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. ముఖ్యంగా డ్రైనేజీ విభాగం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాల వల్ల మొదట అంటురోగాలు ప్రబలే అవకాశం ఉంటుంది పారిశుధ్య విభాగం అప్రమత్తంగా ఉండాలన్నారు. వైద్య విభాగం అంటూ రోగాలు ప్రబలకుండా పారిశుధ్య విభాగంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రజలు గుమికూడే ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం సాయంత్రం సమయంలో దోమల మందును విసృతంగా పిచికారి చేయాలని సూచించారు. వర్షాలు నిలిచిన తర్వాత పారిశుధ్య, వైద్య విభాగం మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. ఎందుకంటే వర్షాలు నిలిచిన తర్వాత వ్యర్థాలు బహిరంగం కావడం, డ్రైనేజీ సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి చోట్ల అప్రమత్తంగా ఉండి ప్రత్యేక చర్యలు యుద్ధప్రాతిపదికన తీసుకోవాలని చెప్పారు.నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని విభాగాలు పరస్పర సమన్వయంతో కమిషనర్ గారి ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని పని చేయాలని తెలిపారు. అవసరం అయినప్పుడు ప్రభుత్వ విభాగాలతో కూడా సమన్వయం చేసుకోవాలని, ప్రభుత్వం ఉద్యోగులకు అన్ని రకాల సెలవులు రద్దు చేసింది కనుక నగరపాలక సంస్థకు చెందిన అధికారులు సిబ్బంది కార్యాలయానికి నిత్యం అందుబాటులో ఉండాలని నగర ప్రజలు ఎప్పుడు ఏ సాయం అడిగినా, మన దృష్టికి వచ్చినా సిబ్బంది అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో యస్.ఈ.శ్యామ్ సుందర్, ఆరోగ్య అధికారి డాక్టర్ అవినాష్ , రెవిన్యూ అధికారి సేతుమాదవ్,డి.ఈ.లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News