నేటి సాక్షి అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్
రాయచోటి నియోజకవర్గం అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నల్లగుట్టపల్లె,రాచపల్లె గ్రామాలలో పలువురి వైఎస్ఆర్ సిపి నాయకుల కుటుంబాలను పరామర్శిన వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి* పార్టీకిఅండగా నిలిచిన కార్యకర్తలకు తనవంతు ధైర్యాన్ని ఇస్తూ తానున్నానంటూ భరోసా కల్పించడం మాజీ ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి నైజం.కష్టాలు, బాధలు,ఇబ్బందులలోవున్నవారిని ఆదుకోవడం,ధైర్యం కల్పించి తోడుగా నిలవడం శ్రీకాంత్ రెడ్డి మంచి మనసుకు నిదర్శనం. ఈ క్రమంలోనే ఆదివారం రామాపురం మండలం నల్లగుట్టపల్లె గ్రామంలోని బి రాచపల్లెలో వైఎస్ఆర్ సిపి నాయకులు మొపూరి భక్తవత్సల రెడ్డి ని, ప్రమాదంలో గాయపడి శస్త్ర చికిత్స జరిగి ఇంటి వద్ద విశ్రాంతి పొందుచున్న వేణుగోపాల్ రెడ్డి ని, కంటి ఆపరేషన్ చేయించుకున్న పెద్దరెడ్డేప్ప రెడ్డి లను, రాచపల్లె గ్రామంలో పోస్టాపీసు వెంకట్రామరాజును, ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడిన ఎగువ కొవ్వూరివాండ్లపల్లె కు చెందిన కొవ్వూరి సుబ్బారెడ్డి లను పరామర్శించి ఆరోగ్య పరిస్తితులనడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు అయోధ్యాపురం నాగభూషన్ రెడ్డి, వెంకట రెడ్డి, మాజీ సింగల్ విండో అధ్యక్షులు పెద్దిరెడ్డి,ఆదినారాయణ రెడ్డి, ఎంపిటిసి ద్వారక నాద రెడ్డి,నాయకులు యోగీశ్వర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, చిన్న రెడ్డేయ్య,వెంట్రామి రెడ్డి,యూత్ లీడర్ అయోధ్యాపురం పవన్ కుమార్ రెడ్డి, అమృతనాయుడు,ఉప సర్పంచ్ రమేష్ నాయుడు,నాగరాజు,వెంకట సుబ్బారెడ్డి,హరి,నాగేంద్ర ,ప్రేమ సాగర్ నాయుడు,మదన మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.