నేటి సాక్షి, నారాయణపేట నవంబర్ 5,పైన కనిపిస్తున్న గ్రామం నారాయణపేట మండలం బొమ్మను పాడు గ్రామం గత 25 సంవత్సరాలుగా బీసీ కాలనీలో అభివృద్ధికి నోచుకపోవడమే, కనీస సౌకర్యాలకు కూడా కరువైన దుస్థితి ఉన్నది, చెత్త చెదారంతో కంప చెట్లతో మురికి కాలువలతో 100 కుటుంబాలు నివసిస్తున్న పట్టించుకోని గత సర్పంచులు ఎంపీటీసీలు, ఆ గ్రామంలో గత ఐదు సంవత్సరాల కిందట వైస్ ఎంపీపీగా పనిచేసిన చరిత్ర గ్రామానికి ఉంది, రాజకీయంగా పోటీతత్వం ఉన్న అభివృద్ధిలో మాత్రం ఆమడ దూరంలో నిలిచి ఉన్నది బొమ్మను పాడు , ఎన్నికలు వస్తే లక్షలు లక్షలు ఖర్చ చేసే రాజకీయ నాయకులు ఉన్నారు కానీ గ్రామం అభివృద్ధికి చేసే నాయలు లేకపోయాడని ఆ గ్రామ యువకులు కి వారి బాధను తెలియజేశారు, అధికారం కోసం పాలకులు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పే నాయకులు తప్ప గ్రామం అభివృద్ధిని పట్టించుకునే వారే కరువయ్యారని అన్నారు, గత ఎమ్మెల్యేకు ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యేకు జిల్లా కలెక్టర్ కు తమ సమస్యలను వివరించిన మా గ్రామ సమస్యలను పరిష్కారం కావడం లేదని అని అన్నారు, గ్రామపంచాయతీ కార్యాలయంలో 22 లక్షల అమౌంట్ ఉన్న గ్రామం అభివృద్ధి చెందడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు, ముఖ్యంగా బీసీ కాలనీలో రోడ్ దాటాలంటే మురికి కాలువ మురికి కంప చెట్లు అడవిలాంటి ప్రాంతంగా మారిపోయింది, కాబట్టి ఇప్పటికైనా ప్రజా పాలకులు ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ గ్రామపంచాయతీ అధికారులు గ్రామ లో నీ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.





