Wednesday, July 23, 2025

అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తుంది:చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని


నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం పని చేస్తుందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు బుధవారం మండలంలోని సి రామాపురం పంచాయతీ కోదండరామాపురం లో నూతనంగా నిర్మించిన సి సి రోడ్డును ప్రారంభించారు ముందుగా కోదండ రామాపురానికి చేరుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని కి కూటమి ప్రభుత్వం నాయకులు సాదరంగా ఆహ్వానించిన అనంతరం గ్రామ దేవత నాగాలమ్మ దేవాలయంలో అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గ్రామంలోని ప్రతి ఒక్కరుతో అప్యాయంగా పలకరించిన ఆయన సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్, యువనేత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు పరిపాలనలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు సూపర్ సిక్స్ లో భాగంగా ఫించన్లు పంపిణీ సక్రమంగా అమలు చేయడం, అదేవిధంగా పాఠశాల ప్రారంభం రోజున తల్లికి వందనం కార్యక్రమంలో ప్రతి ఇంటిలో ఎంత మంది ఉన్నా విద్యార్థుల తల్లుల అకౌంట్ లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మేకల తిరుమలరెడ్డి,సీనియర్ నాయకులు చిన్నబాబు, కొట్టే నరసింహా రెడ్డి, ఉమాపతి నాయుడు,తానికొండ కేశవులు నాయుడు,నీలకంఠ చౌదరి, మండల ప్రధాన కార్యదర్శి రావిళ్ళ గిరిబాబు, మండల ఉపాధ్యక్షులు కొట్టే గిరిధర్ రెడ్డి, మండల పరిశీలకులు ఊరిబిండి మునిశేఖర్, మండల నాయకులు కొల్లం గుంట ముని రామిరెడ్డి, కొట్టే ధనుంజయ రెడ్డి, రేకులచేను మోహన్ రెడ్డి,డి. హరిప్రసాద్,కె మధుసూదన్ రెడ్డి,లెక్కల మహేష్ నాయుడు, చేకూరి వెంకట ప్రసాద్, రవి ప్రసాద్, పాకాల కుమార్, సుబ్రహ్మణ్యం రెడ్డి , రంజిత్ కుమార్ రెడ్డి, జిల్లా అధికారులు, తాసిల్దార్ వెంకటరమణ,ఎంపిడిఓ ఇందిరా, మండల అధికారులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News