Sunday, March 8, 2026

*అభ్యంతరాలు పరిష్కారంలో నిబంధనలు పాటించాలి**జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్* మంచిర్యాల జిల్లా,, ఫిబ్రవరి 2,

నేటి సాక్షి 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నామినేషన్లపై అందిన అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిష్కారంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని చెన్నూర్ మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి నామినేషన్లపై అందిన అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ చెన్నూర్ మున్సిపల్ పరిధిలోని 18 వార్డులకు సంబంధించి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నామినేషన్లపై అందిన దరఖాస్తులను ఎన్నికల నిబంధనల ప్రకారం పరిష్కరించి అర్హులైన అభ్యర్థుల జాబితా తయారు చేయాలని, 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ప్రకటన జరుగుతుందని తెలిపారు. ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్, 12వ తేదీన రీపోలింగ్ (ఏమైనా ఉన్నట్లయితే), 13వ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి గెలుపొందిన అభ్యర్థుల ప్రకటన జరుగుతుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ నం.08736-250501 ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికల సంబంధించిన సమాచారం, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన పై ఫిర్యాదుల కొరకు సంప్రదించవచ్చని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు,అనంతరం చెన్నూర్ పట్టణంలో చేపట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అమృత్ 2.0 క్రింద పట్టణంలో చేపట్టిన నీటి ట్యాంక్ నిర్మాణ పనులను పరిశీలించి, వచ్చే వేసవిలో ప్రజలకు ఎలాంటి త్రాగునీటి సమస్యలు లేకుండా పనులు వేగవంతం చేయాలని తెలిపారు. ప్రజా సంక్షేమంలో భాగంగా చెన్నూర్ మండల కేంద్రంలో చేపట్టిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మధ్యాహ్న భోజనంలో ప్రభుత్వం చేపట్టిన మెనూ ఖచ్చితంగా అమలు చేయాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. 10వ తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులను సన్నద్ధం చేయాలని, ఉత్తమ ఫలితాలు సాధన దిశగా ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు,

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News