Saturday, March 21, 2026

అభ్యర్థులు… ఐదు దాటితే అంతే సంగతులు వరంగల్ జిల్లా కలెక్టర్‌ సత్య శారద

నేటి సాక్షి, నల్లబెల్లి డిసెంబర్ 01 : స్థానిక సంస్థల ఎన్నికలలో నిలబడే అభ్యర్థుల నామినేషన్ స్వీకరణ డిసెంబర్ 2వ తారీఖున సాయంత్రం 05 గంటలు దాటితే అంతే సంగతులు జిల్లా కలెక్టర్ సత్య సారద మండల అధికారులకు ఆదేశించారు. సోమవారం నల్లబెల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణన కేంద్రాలను పరిశీలించారు.జిల్లాలో రెండవ దశలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియ నాలుగు మండలాల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. నామినేషన్ సెంటర్ వద్ద ఏర్పాటుచేసిన హెల్ప్ డెస్క్ ద్వారా అందిస్తున్న వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నియమ, నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని, విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి తు.చ తప్పకుండా అమలయ్యేలా చూడాలన్నారు. బ్యాంకుల జీరో అకౌంట్ వల్ల అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూడాలని బ్యాంకు అధికారులకు సూచించారు. డిసెంబర్ 02వ తారీకు సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థులు గ్రామపంచాయతీ ఆవరణలో ఉన్నోళ్లకే అవకాశం ఉంటుందంటూ నిమిషం లేట్ అయిన లోపలికి ప్రవేశం ఉండదు అంటూ 05 గంటల తర్వాత వచ్చిన వాళ్ళ అభ్యర్థుల నామినేషన్ పత్రాల స్వీకరణ తీసుకోకూడదంటూ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ రామిరెడ్డి, ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్ కృష్ణ, ఎంపీడిఓ సుభానివాస్ ఎస్సై వి గోవర్ధన్, ఎన్నికల అధికారులు, మండల అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News