(నేటిసాక్షి )మాదిగ రిజర్వేషన్ పోరాటాసమితి నిర్వహించిన వర్గీకరణ కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులు అర్పించిన ఎమ్మార్పీఎస్ నాయకులు. వివరాల్లోకెళ్తే జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో ని mrps, msp నాయకులు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీ వర్గీకరణ కోసం చేసిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన నాయకులకు అమరవీరులకు అంబేద్కర్ చౌక్ వద్ద ఆదివారం కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బుగ్గారం మండలం ఎం ఆర్ పి ఎస్,ఎం ఎస్ పి, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు యువకులు పాల్గొన్నారు.





