Tuesday, January 20, 2026

అమాయక మహిళలే లక్ష్యంగా.. దృష్టి మరల్చి బంగారం దొంగిలిస్తున్న అంతర్ జిల్లా ముఠా అరెస్ట్ .-జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా.

నేటి సాక్షి వికారాబాద్:వికారాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా అమాయక మహిళలే లక్ష్యంగా చేసుకొని, వారి దృష్టి మరల్చి బంగారం దొంగిలిస్తున్న ముగ్గురు పాత నేరస్తుల ముఠాను జిల్లా సి‌సి‌ఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.నేర వివరాలు & దర్యాప్తు:జిల్లాలోని ధారూర్, వికారాబాద్ టౌన్ పరిగి పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుసగా మహిళలను మోసం చేసి బంగారం దొంగిలించిన ఘటనలు నమోదు కావడంతో, జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఈ కేసులను సీరియస్‌గా పరిగణించారు. నిందితులను తక్షణమే పట్టుకోవాలని జిల్లా సీసీస్ పోలీసు అధికారులను ఆదేశించారు.ఎస్పీ ఆదేశాల మేరకు, సి‌సి‌ఎస్ ఇన్స్పెక్టర్ బల్వంత్ రాయ్ ఆధ్వర్యంలోని బృందం రంగంలోకి దిగింది. సీసీటీవీ ఫుటేజీలు, టెక్నికల్ ఆధారాలు మరియు నేరం జరిగిన తీరును విశ్లేషించి, పక్కా సమాచారంతో ముగ్గురు మహిళా నిందితులను అదుపులోకి తీసుకున్నారు.అరెస్టు చేయబడిన నిందితులు:ఎ-1) వేముల లక్ష్మి w/o వేముల నాగేశ్వరా రావ్, రామ రావ్ నగర్, నియర్: స్కూల్, బోరబండ, బాలానగర్.ఏ -2) చెల్లా నర్సమ్మ w/o చెల్లా వెంకటేష్, R/o H No. 8-19, దంగా ఖలీజ్ ఖాన్, కిస్మాతపుర, రాజేంద్ర నగర్, కేవీ రంగా రెడ్డి. ఏ -3) బండారి అనిత w/o లేట్. బండారి గిరి, ఏజ్:శివ శంకర్ కాలనీ, ఎల్లమ్మ టెంపుల్, ఫాతే నగర్, బాలానగర్, సనత్ నగర్,వీరు కేవలం వికారాబాద్ జిల్లాలోనే కాకుండా నారాయణపేట జిల్లాలోని మద్దూర్, కోస్గి నరననపేట టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ, గతంలో సైబరాబాద్, హైదరాబాద్, నిజామాబాద్, రాచకొండ మరియు జగిత్యాల జిల్లాల్లో సుమారు 28 కేసుల్లో నిందితులుగా ఉన్నారు.నేరం చేసే విధానం (మోదుస్ ఆపరేండి)ఈ ముఠా ప్రధానంగా ఒంటరిగా ఉన్న, వయసు పైబడిన అమాయక మహిళలనే టార్గెట్ చేస్తారు. వీరి మోసం చేసే పద్ధతి ఈ విధంగా ఉంటుంది:1. నకిలీ బంగారం ఎర: రద్దీగా ఉండే మార్కెట్లు లేదా నిర్మానుష్య ప్రదేశాల్లో మహిళలను ఎంచుకుంటారు. వారి ముందు నకిలీ బంగారు బిస్కెట్లు, రాడ్లు లేదా బంగారు రంగు పూసిన రాళ్లను పడవేస్తారు లేదా తమకు దొరికినట్లు నటిస్తారు.2. నమ్మకంతో మోసం (కాంఫిడెన్స్ ట్రిక్): “మాకు బంగారం దొరికింది, దీనిని మనం పంచుకుందాం” అని బాధితురాలిని నమ్మించి మాటల్లో పెడతారు. ఆ నకిలీ బంగారాన్ని బాధితురాలికి ఇచ్చి, ఆమె మెడలో ఉన్న అసలైన బంగారు గొలుసులు, కమ్మలు తీసుకుంటారు.3. మత్తు మందు ప్రయోగం: కొన్ని సందర్భాల్లో బాధితురాలిని మాటల్లో పెట్టి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మత్తు మందు ప్రయోగించి (స్తుపెఫయింగ్ డ్రగ్స్), వారు స్పృహ కోల్పోయాక బంగారం దొంగిలిస్తారు.జిల్లాలో జరిగిన ప్రధాన సంఘటనలు:• ధారూర్ (22.11.2025): కంది లక్ష్మమ్మ అనే మహిళ కూరగాయల మార్కెట్ వద్ద ఉండగా, ఆమెకు నకిలీ బంగారు రాడ్ చూపించి, ఆమె మెడలోని 1.8 తులాల బంగారం (గొలుసు, కమ్మలు, మ్యాట్నిలు) కాజేసి మోసం చేశారు.• వికారాబాద్ (30.11.2025): బాసుపల్లి సత్యమ్మను సుబాష్ నగర్ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, బంగారు రాయి లాంటి వస్తువు చూపించి, ఆమెకు తెలియకుండానే మత్తు మందు ప్రయోగించి 2 తులాల గొలుసును దొంగిలించారు. పరిగి (05.01.2026): పోమల ఈశ్వరమ్మను వెంబడించి, రోడ్డుపై పర్సు దొరికినట్లు నాటకమాడి, అందులో 5 తులాల బంగారం ఉందని నమ్మించారు. ఆ నకిలీ బిస్కెట్ ఆమెకు ఇచ్చి, ఆమె వద్ద ఉన్న 1 తులం గొలుసు, 3 గ్రాముల కమ్మలు తీసుకొని ఉడాయించారు.ప్రజలకు విజ్ఞప్తి:అపరిచితులు ఎవరైనా బంగారం దొరికిందని చెప్పినా, లేదా మాయమాటలు చెప్పి దగ్గరకు వచ్చినా నమ్మవద్దు. ముఖ్యంగా మహిళలు మార్కెట్లు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. అనుమానం వస్తే వెంటనే డయల్ 100 కి లేదా దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వాలని కోరుచున్నాము.కేసును చాకచక్యంగా ఛేదించిన సీసీస్ ఇన్స్పెక్టర్ బల్వంత్ రాయ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.స్వాదినపర్చుకున్న వస్తువులు:1). 8 తులాల 8 గ్రాముల బంగారము 2). 50 తులాల వెండి. 3). మూడు (3) సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News