నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్)మైలార్ దేవ్ పల్లి డివిజన్ లోని లక్ష్మీగూడా ప్రాంతంలో బక్రీద్ మరుసటి రోజు ఆదివారం నాడు రాత్రి సమయంలో గోమాత కళేబరాలను అక్రమంగా తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని అడ్డుకున్న సంఘటనకు సంబంధించి, మహేశ్వరం నియోజకవర్గం జల్ పల్లి లో నివసిస్తున్న అమాయక హిందువులపై పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేసి, వారిని చంచలగూడ జైలుకు రిమాండ్‌కు పంపిన నేపథ్యంలో ఈరోజు *బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ అందెల శ్రీరాములు* , జల్ పల్లి గ్రామంలో బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు నివాసానికి వెళ్లి అరెస్ట్ అయిన హిందూ యువకుల కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యాన్ని అందించారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, న్యాయపరమైన సహాయంతోపాటు భారతీయ జనతా పార్టీ వెంట నిలుస్తుందని హామీ ఇచ్చారు.అమాయకులను లక్ష్యంగా చేసుకుని వత్తిడి చర్యలు కొనసాగితే, కాషాయ దళం మౌనంగా ఉండదని, ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని పోలీస్ శాఖను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జల్ పల్లి మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షులు మనోజ్, బిజెపి సీనియర్ నాయకులు గొరిగే మల్లేష్, శాంత కుమార్, నర్సింగ్ గౌడ్, సంతోష్, గొరిగే శ్రీకాంత్, శివ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, షేర్ సింగ్, హరికృష్ణ, శివ, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

