Monday, March 16, 2026

అమినిగుంట అంగన్వాడీ కార్యకర్త పనితీరుపై విచారణ

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి నవంబర్ 6 అమినిగుంట అంగన్వాడీ కేంద్రంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన కార్యకర్తపై గురువారం ఐసిడిఎస్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు ఇటీవల రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రుకియా బేగం మండలంలో పర్యటించిన నేపథ్యంలో అంగన్వాడీ కార్యకర్త కమలముపై పలు ఆరోపణలు వచ్చినట్లు జిల్లా అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేసిన విషయం విధితమే దీంతో స్పందించిన జిల్లా పిడి వెంకటేశ్వరి ఆదేశాల మేరకు విచారణ చేపట్టారు అంగన్వాడి పరిధిలోని పిల్లలు వారి తల్లులు బాలింతలను పిలిపించి గ్రామ పెద్దల సమక్షంలో అధికారులు విచారణ చేపట్టారు ప్రతి ఒక్కరూ తమకు సక్రమంగా అన్ని అందుతున్నాయని ప్రభుత్వం నుంచి వచ్చే పౌష్టికాహారం అందరికీ అందుతుందని వారు అధికారులు దృష్టికి తీసుకువచ్చారు ఈ మేరకు జిల్లా అధికారులకు నివేదిస్తామని ఐసిడిఎస్ సిడిపిఓ రాజేశ్వరి తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు జంపాల శ్రీనివాసులు శంకర వేణుగోపాల్ ఐసిడిఎస్ సీనియర్ అసిస్టెంట్ కళ్యాణి సూపర్వైజర్ రాధా మహిళా పోలీస్ రేఖ అంగన్వాడీ పరిధిలోని తల్లులు వారి పిల్లలు బాలికలు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News