నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల సభ్యులకు చదవడం, వ్రాయడం నేర్పించడం లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అమలవుతున్న ULLAS పథకంలో భాగంగా ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమాన్ని కోరుట్ల మున్సిపాలిటీలో ప్రారంభించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో ఈ కార్యక్రమం అమలవుతోంది.*అక్షరాస్యతతో సాధికారత*ఈ కార్యక్రమంలో భాగంగా మెప్మా ఏవో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..మహిళలు చదవడం, వ్రాయడం నేర్చుకొని అందరికీ ఆదర్శంగా నిలవాలని సూచించారు. అక్షరాస్యత ద్వారా మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం కార్యాలయాల్లో స్వయంగా దరఖాస్తులు రాసే స్థాయికి చేరుకునేలా ఈ పథకం తోడ్పడుతుందన్నారు.*మార్గదర్శక పుస్తకాల వినియోగం*CRPలు మాధవీలత, స్రవంతి అక్షరాస్యత ప్రాధాన్యతను వివరిస్తూ, వాలంటీర్లు మహిళలకు సులభ పద్ధతుల్లో బోధించాలని సూచించారు. ఇందుకోసం మార్గదర్శిని పుస్తకం, అక్షర వికాసం పుస్తకం ఉపయోగపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలోమెప్మా DMC సునీత,TMC శ్రీరామ్ గౌడ్,COలు గంగారాణి, సంధ్య,మహిళా సమాఖ్య ప్రతినిధులుమెప్మా రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. మహిళలు విస్తృతంగా పాల్గొని అక్షరాస్యత సాధనకు ముందుకు రావాలని అధికారులు పిలుపునిచ్చారు.______

