నేటి సాక్షి – మెట్ పల్లి*ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట బస్టాండ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందడంతో పాటు, ఆమె కుమారుడికి తీవ్ర గాయాలు అయినట్టు ఇబ్రహీంపట్నం ఎస్సై అర్కల అనిల్ తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం..కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన తాళ్లపల్లి లక్ష్మీ (61) ఆమె కుమారుడు అయిన తాళ్లపల్లి సిరోజ్ కలిసి వర్షకొండ గ్రామానికి వెళ్లి తిరిగి సిరికొండకు వెళ్తుండగా, అమ్మకపేట బస్టాండ్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.బస్టాండ్ వద్దకు చేరుకునేసరికి వీరు వెళ్తున్న ద్విచక్ర వాహనం నెంబర్ టియస్ 08 ఈవి 9328 కి ఎదురుగా మేడిపల్లి గ్రామానికి చెందిన మంతెన రమేష్ కారుని అదే గ్రామానికి చెందిన కొడిచెర్ల మధు అను వ్యక్తి అతివేగంగా కారు నెంబర్ టియస్ 21 ఎ 3929 నడుపుకుంటూ వచ్చి వఢీకొట్టారు. బైక్ పై నుండి కింద పడ్డ లక్ష్మి మరియు ఆమె కుమారుడు ఇద్దరికీ గాయాలవ్వగా, హుటాహుటిన మెట్ పల్లి ప్రభుత్వ హాస్పిటల్ తీసుకువెళ్లగా, చికిత్స పొందుతూ లక్ష్మి మరణించగా ఆమె కుమారుడు తాళ్లపల్లి సిరోజ్ నీ మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించినట్టు చెప్పారు. మృతురాలి భర్త తాళ్లపల్లి గంగాధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు చెప్పారు.—-

