నేటి సాక్షి ప్రతినిధి చేవెళ్ల
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల పట్టణంలోని రంగారెడ్డి నగర్ కాలనీ వీరభద్ర నగర్ మరియు చంద్రారెడ్డి నగర్ కాలనీ లలో జరిగిన పోచమ్మ బోనాల పండుగలో పాల్గొని, అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన చేవెళ్ల శాసనసభ్యులు “కాలే యాదయ్య”
అనంతరం ఎమ్మెల్యే చేవెళ్ల మండలం ఈర్లపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ గ్రామ దేవత “పోచమ్మ తల్లి విగ్రహ” ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అమ్మవారి దయతో సకాలంలో వర్షాలు పడి రైతులు, ప్రజలు పాడిపంటలతో సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.