నేటి సాక్షి, మెట్ పల్లి రూరల్
అమ్మ మాట అంగన్వాడి బాట అని సిడిపిఓ మనెమ్మ అన్నారు. మంగళవారం కార్యక్రమం లో భాగంగా మండలం లోని వెల్లుల్ల ఐదవ సెంటర్ లో తల్లుల కమిటీ మరియు గర్భిణీ బాలింతలు, అంగన్వాడి కేంద్రానికి వచ్చే పిల్లల పేరెంట్స్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. అంగన్వాడీలో పిల్లలకు ప్రీస్కూల్ కార్యక్రమాలు నిర్వహించే విధానం గురించి అవగాహన కల్పించడం జరిగింది. పిల్లల మేధో వికాసం , చిన్న పెద్ద కండరాల అభివృద్ధి కలిగించే ఆటల గురించి పాటల గురించి కథల గురించి తల్లులకు వివరించి త్రి+పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేయించాలని తల్లులను కోరడమైనది. ఈ కార్యక్రమంలో సిడిపిఓతో పాటు సూపర్వైజర్ షమీo సుల్తాన,అంగన్వాడి టీచర్ నీరజ, తల్లులు, కిశోర బాలికలు అధిక పాల్గొన్నారు.

