Saturday, March 21, 2026

అయ్యప్ప మాల ధారణను స్వీకరించిన పెద్దిరెడ్డి సోదరులు..రామచంద్రారెడ్డి, ద్వారకానాథ్ రెడ్డిఇక 40 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో అయ్యప్ప దీక్షలో..

నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 04 ~అన్నమయ్య జిల్లా :-: : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గురువారం వేకువ జామున భారతదేశంలోనే శైవ క్షేత్రాల్లో ప్రసిద్ధి గాంచిన తిరుపతి శ్రీశ్రీశ్రీ కపిలేశ్వర స్వామి సన్నిధిలోని కపిలతీర్థం సన్నిధానంలో కపిలేశ్వర స్వామిని దర్శించుకుని ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య వేద పండితుల దివ్య హస్తాలతో అయ్యప్ప స్వామి వారి మాల ధారణ చేపట్టారు. మరో పక్క తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి సైతం శబరిమలై అయ్యప్ప స్వామి వారి ఆలయ నమూనా తో వెలసిన వారి సొంత అయ్యప్ప స్వామి వారి సన్నిధానమైన చిత్తూరు జిల్లా సదుంలోని కోటి మాలై ఆలయంలో వేకువ జామున స్వామివారి పుష్కరణి లో స్నాన మాచరించి అయ్యప్ప స్వామివారిని దర్శించుకొని వేద మంత్రోచ్ఛారణ మధ్య ఆలయ వేద పండితుల దివ్య హస్తాలతో అయ్యప్ప స్వామి వారి మాల స్వీకరించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా కఠోర ఉపవాస దీక్షతో, భక్తిశ్రద్ధలతో, నియమ నిష్ఠలతో 40 రోజుల పాటు అయ్యప్ప దీక్షలో కొనసాగనున్నారు. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం లో వెలసిన కోటమలై అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఏడాదికి రెండు పర్యాయాలు అయ్యప్పస్వామి వారి మాల ధారణ చేసే కోవ లోనే ఈ పారి కూడా అయ్యప్ప మాల ధారణ స్వీకరించామని పెద్దిరెడ్డి సోదరులు పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పేర్కొన్నారు. పెద్దిరెడ్డి సోదరులతో పాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ కొండవీటి నాగభూషణం, సోమశేఖర్, మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ జింక చలపతి, వైసీపీ ముఖ్య నాయకుడు సీపీ సుబ్బారెడ్డి, యువ నాయకుడు కొండవీటి నరేష్, అయ్యప్ప స్వామి వారి దీక్ష చేపట్టారు. నూక తోటి రాజేష్, కృష్ణమూర్తి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరిని మర్యాదపూర్వకంగా కలిశారు..~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News