Friday, March 13, 2026

*అయ్యప్ప స్వామి ఆలయంలో గోపూజ*

నేటి సాక్షి, ధర్మారం (అక్టోబర్ 22) : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని హరిహరసుత శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం మరియు గోశాలలో బుధవారం అత్యంత వైభవంగా గోపూజ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు తాటిపల్లి ఈశ్వర్ ఆధ్వర్యంలో గోమాతను పసుపు, కుంకుమలతో అలంకరించి పూజించారు. అనంతరం ఆలయ పూజారి మంత్రోచ్ఛారణల మధ్య భక్తులు గోమాత చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు తాటిపల్లి ఈశ్వర్ మాట్లాడుతూ… ప్రతి హిందువు గోమాతను సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మరియు చుట్టుపక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News