Friday, March 20, 2026

*అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకలు*

నేటి సాక్షి, ధర్మారం (నవంబర్ 26) : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని హరిహరసుత శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం సుబ్రహ్మణ్యస్వామి షష్టి (జన్మదినోత్సవ) వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు చేశారు. ఈ సందర్భంగా స్వాములు భక్తి గీతాలు ఆలపించారు. అనంతరం ఆలయంలో గోమాతను పసుపు, కుంకుమలతో అలంకరించి గోపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్పస్వామి ఆలయ వ్యవస్థాపకులు తాటిపల్లి సునీత-ఈశ్వర్, ఆలయ పూజారి బీవి నర్సింగా రావు, అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News