Wednesday, March 18, 2026

అయ్యప్ప స్వామి కృపవల్లే చద్ది కార్యక్రమం * మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ * అయ్యప్ప స్వామీ లకు చద్ది కార్యక్రమం ప్రారంభించిన అన్నం.

నేటి సాక్షి, బాపట్ల జిల్లా (బాపట్ల టౌన్)బాపట్ల శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతోనే గత 21 సంవత్సరాలుగా చద్ది కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నానని భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, ఉమ్మడి గుంటూరు జిల్లా మాజీ శాసనమండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ అన్నారు. కార్తీక మాసం మొదటి రోజు సందర్భంగా శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో మాలదారులకు చద్ది కార్యక్రమాన్ని అన్నం సతీష్ ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభించారు. మొదటిగా అన్నం సతీష్ ప్రభాకర్ అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పడి వెలిగించి చది కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్నం సతీష్ ప్రభాకర్ మాట్లాడుతూ చద్ది కార్యక్రమాన్ని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నప్పటికీ ఎందరో కృషి ఈ కార్యక్రమంలో ఉందన్నారు. ఆర్థికపరంగా తాను చూసుకుంటున్నప్పటికీ తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు చద్ధి కార్యక్రమం ప్రతిరోజు ముగిసే అంతవరకు ఎందరో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్వామివారి సేవలో లీనం అవుతున్నారు అన్నారు.వారందరి సహకారంతో గత 21 సంవత్సరాలుగా ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో మాలధారులకు చద్ది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని చెప్పారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉన్నంతకాలం తాను విజయవంతంగా చద్ది కార్యక్రమాన్ని కొనసాగిస్తానని వివరించారు. 41 రోజులపాటు చద్ది కార్యక్రమం కొనసాగుతుందని వివరించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చది కార్యక్రమంలో సోమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బుర్లె రామ సుబ్బారావు, గురు స్వామి సుబ్బారావు, బిజెపి మాజీ జిల్లా పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, బిజెపి నియోజకవర్గ బాధ్యులు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News