నేటి సాక్షి అనంతగిరి సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల కేంద్రంలో తెలంగాణ శబరిమలైగా పేరొందిన హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప దీక్ష పూనిన స్వాములకు 58 రోజులపాటు అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.దీనిలో భాగంగా గురువారం అన్నదానం సుమారు 500 మంది స్వాములు బిక్ష సేకరించారనీ ఆలయ చైర్మన్ గురుస్వామి కొండపల్లి వాసు తెలిపారు. ఈ కార్యక్రమంలో. గాదం లింగయ్య. నరసింహారావు. మధు. వెంకటేశ్వర్లు. ఉపేందర్.అభినవ్. శ్రీను. రామకృష్ణ తదితర స్వాములు పాల్గొన్నారు




