నేటి సాక్షి, బాపట్ల జిల్లా ప్రతినిధిఅర్జీలను చట్ట పరిధిలో విచారించి నిర్దిష్ట గడువులోగా పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ తెలిపారు. జిల్లా ఎస్పీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీ దారులు తమ సమస్యలను జిల్లా ఎస్పీ కి విన్నవించుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో విచారించి పరిష్కరించాలని జిల్లా పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. అర్జీలు పదేపదే పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని తెలిపారు. మహిళలు, వృద్ధుల యొక్క ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలన్నారు. అర్జీలను పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీస్ కార్యాలయానికి పంపాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు .భూ వివాదాలు, ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మోసాలు వంటి పలు సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 83 మంది అర్జీ దారులు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి విచ్చేసి తమ సమస్యలను విన్నవించుకున్నారని, వారి అర్జీలను చట్టపరిధిలో విచారించి పరిష్కరిస్తామని ఎస్పీ తెలిపారు.ఈ కార్యక్రమంలో సిసిఎస్ డిఎస్పి పి.జగదీష్ నాయక్ , పిజిఆర్ఎస్ సెల్ ఇన్స్పెక్టర్ యు.శ్రీనివాసరావు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.





