Friday, March 13, 2026

అర్హులైన పేద కుటుంబాలకు న్యాయం జరగాలి

నేటి సాక్షి మార్చి 13 (మంచిర్యాల్) శ్రీధర్ దమ్మ బెల్లంపల్లి పట్టణంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అనర్హులకు కేటాయించకుండా నిజమైన అర్హులైన పేదలకు ఇవ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్లు సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిబంధనల ప్రకారం పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే కేటాయించాలని కోరారు. కొన్ని చోట్ల అనర్హులకు ఇళ్లు కేటాయించబడుతున్నాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి పరిశీలన చేసి పారదర్శకంగా కేటాయింపులు చేయాలని విజ్ఞప్తి చేశారు.అర్హులైన పేద కుటుంబాలకు న్యాయం జరిగేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు సబ్ కలెక్టర్‌ను కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News