నేటి సాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్):* గన్నేరువరం మండలంలోని చొక్కారావుపల్లె గ్రామ అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ అరుకొంతం గోపాల్ రెడ్డి హాజరై మాట్లాడుతూ పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడంతో మానసిక ఎదుగుదల బాగుండడంతో పాటు వ్యాధి నిరోధిక శక్తి పెరుగుతుందన్నారు. పోషక విలువలు కలిగిన పాలు గుడ్లు తాజా ఆకుకూరలు పప్పు దినుసులు చిరుధాన్యాలు తదితర ఆహార పదార్థాలను ప్రతిరోజు తప్పక తీసుకోవాలని సూచించారు చిన్నారులను అంగన్వాడి కేంద్రంలో చేర్పించాలని ఆయన కోరారు. అనంతరం చిన్నారులకు అక్షరాబ్యాసమ్ నిర్వహించారు. కార్యక్రమం అనంతరం సర్పంచ్ అరుకొంతం గోపాల్ రెడ్డి ఉప సర్పంచ్ మామిడి జైపాల్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మామిడి జైపాల్ రెడ్డి ఆంగన్వాడీ సూపర్ వైజర్ కవిత, ఆంగన్వాడీ టీచర్ పులి శారద,తల్లులు రేణుక మౌనిక రమ్య లావణ్య శారద నాగవ్వ గర్భవతులు బాలింతలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

