నేటి సాక్షి గజ్వేల్ :గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తూంకుంట అంక్షారెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు విడతలుగా కాంగ్రెస్ ప్రభుత్వం గజ్వేల్ నియోజకవర్గానికి 7 వేల ఇందిరమ్మ ఇండ్లు కేటాయించినట్లు తెలిపారు.బుధవారం గజ్వేల్ మండలం బెజగాం గ్రామంలో సర్పంచ్ నకిర్తి గోపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, పీసీసీ నాయకులు నాయిని యాదగిరి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అశోక్ రెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.రేకుల ఇంటిలో నివసిస్తున్న లబ్ధిదారుడు నరహరి కుటుంబం ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకొని గృహప్రవేశం చేయడం సంతోషకరమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ గజ్వేల్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.చారిత్రాత్మక నిర్ణయాలు సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్నారని, ఏకకాలంలో రూ.2 లక్షల పంట రుణమాఫీ చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు. అలాగే రైతు భరోసా కింద రూ.9 వేల కోట్ల నిధులు విడుదల చేయడంతో ప్రతిపక్షాల విమర్శలకు చోటు లేకుండా పోయిందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి పంటను కొనుగోలు చేస్తోందని, సన్నధాన్యానికి రూ.500 బోనస్ రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. యూరియా పక్కదారి పట్టకుండా అక్రమాలను అరికట్టేందుకే పంపిణీపై పటిష్ట చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.గ్రామాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పార్టీలకు అతీతంగా సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.5 కోట్ల 41 లక్షలు మంజూరు చేసినట్లు అంక్షారెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సుఖేందర్ రెడ్డి, సర్పంచులు వెంకట్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రశాంత్, మైనార్టీ సెల్ జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సమీర్, నేతలు శివారెడ్డి, గుంటుకు శ్రీనివాస్, జంగం రమేష్ గౌడ్, గాడిపల్లి శ్రీనివాస్, మహమ్మద్ అజ్గర్, నక్క రాములు, జాకీర్, కొండల్ రెడ్డి, నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.





