Sunday, March 15, 2026

*అర్హులైన ప్రతి పేదవారికి ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ అందించడమే ప్రభుత్వ ధ్యేయం: మాజీ ఎంపిపి తానికొండ కేశవులు నాయుడు*.

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*రామచంద్రాపురం* కూటమి ప్రభుత్వం పాలనలో అర్హులైన ప్రతి పేదవారికి ఎన్టీఆర్ భరోసా పింఛను సక్రమంగా ప్రతి నెలా ఒకటో తేదీ అందించి వారికి భరోసా కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని మాజీ ఎంపిపి తాని కొండ కేశవులు నాయుడు అన్నారు శనివారం మండలం పరిధిలోని రామచంద్రాపురం ఎస్టీ కాలనీ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశాల మేరకు తిరుపతి రెవెన్యూ డివిజన్ ఆఫీసర్, చంద్రగిరి నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ రామ్మోహన్ , తాసిల్దార్ యు మధుసూదన రావు,టిడిపి మాజీ మండల పార్టీ అధ్యక్షులు కొట్టే నరసింహారెడ్డి, కోరా హరిప్రసాద్ టిడిపి నాయకులు ఎస్టీ కాలనీ లో ఇంటింటా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కేశవులు నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి పేదవానికి భరోసా కల్పించేందుకు ఎన్టీఆర్ భరోసా పేరుతో ప్రతినెల ఒకటో తేదీ నుంచి ఉదయం నుంచే ప్రతి ఇంటి వద్దకే వెళ్ళి ఎన్టీఆర్ భరోసా పింఛను అందిస్తున్నామని,ప్రజల ఆశయాలు ఆకాంక్షలు నెరవేర్చడమే మా కూటమి ప్రభుత్వ ప్రధమ కర్తవ్యమని అదేవిధంగా నవంబర్ 1,3 తేదీల్లో పెన్షన్ డబ్బులు పంపిణీ ఉంటుందని, రెండవ తేదీ ఆదివారం సెలవు అని తెలిపారు.ఓల్డ్ ఏజ్ పర్సన్ కి 4000 వేలు, దివ్యాంగ పెన్షన్ 6000 వేలు డయాలసిస్ కిడ్నీ సమస్యలకు బాధపడుతున్న వారికి 15000 ఇస్తున్నామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో తిరుచానూరు వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ పసుపులేటి విజయ కుమార్,టిడిపి నాయకులు దుర్గ సముద్రం హరిప్రసాద్, లెక్కల సురేంద్ర నాయుడు,కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News