Tuesday, March 10, 2026

అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి

కాంగ్రెస్ కార్యకర్తలకు కాదు…

:ధర్మసమాజ్ పార్టీ జిల్లా కన్వీనర్ గువ్వల శివరాజ్

నేటి సాక్షి,నారాయణపేట జూన్ 30,

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల అర్హుల ఎంపిక విషయంలో జిల్లా వ్యాప్తంగా తీవ్రమైన అవకతవకలు జరిగాయి కేవలం కాంగ్రెస్ కార్యకర్తలను మాత్రమే అర్హులుగా గుర్తించి ఎంపిక చేయడం జరిగింది. కావున జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని అధికారులతో స్వయంగా ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జాబితాను పున: పరిశీలించి వాస్తవంగా ఇల్లు లేని నిరుపేదలకు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయవలసిందిగా ధర్మ సమాజ్ పార్టీ నారాయణపేట జిల్లా నాయకులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది చేయడం జరిగింది ఈ సందర్భంగా ధర్మ సమాజం పార్టీ నారాయణపేట జిల్లా కన్వీ నర్ గువ్వల శివరాజ్ మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది నారాయణపేట జిల్లాల్లోని చాలా గ్రామాలలో చాలా కుటుంబాలకు ఉండటానికి ఇల్లు లేదు అందుకని జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని మండల గ్రామ అధికారులతో చర్చించి ఇంతవరకే ఎంపిక చేసిన ఇందిరమ్మ ఇళ్ల జాబితాను పున: పరిశీలించి ఇల్లులేని వారికీ పూరి గుడిసెలో నివసిస్తున్నటువంటి కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయగలరని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు పోర్ల డేవిడ్ మహారాజ్,బలిజ వీరేష్, ఈశ్వర్,అశోక్ మహారాజ్, నరసింహ మహారాజ్ అంజి,పరశురాం, అరుణ్,అంజి, ఎస్ నరసింహ మహారాజ్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News