Sunday, March 15, 2026

అలుగుపారుతున్న పాలేరు రిజర్వాయర్..మండలంలో భారీ వర్షాలతో నిండుకుండలా చెరువులు , కుంటలు.

నేటి సాక్షి పాలేరు , అక్టోబర్ 29 :రెండు రోజులుగా ఎడతెరపకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుండి భారీగా వరద చేరడంతో కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయం మత్తడి దూకుతుంది.. బుధవారం ఇరిగేషన్ ఎస్సీ మంగళంపూడి వెంకటేశ్వర్లు పాలేరు రిజర్వాయర్ ను సందర్శించారు.. అన్ని గేట్లు ఓపెన్ కావడంతో దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేశారు.. దాదాపు అన్ని గ్రామాల్లోని చెరువులు , కుంటలు మత్తడి దూకుతూ నిండు కుండలా మారాయి.. ఖరీప్ సీజన్ ముగిసే సమయానికి చెరువులు ,కుంటలు దాదాపు 75 శాతం నుండి 60 శాతానికి నీటి సామర్ధ్యం తగ్గుతుంది.. కానీ ఈ ఏడాది పొడవునా వర్షాలు కురుస్తూనే ఉండడంతో ఇప్పటికీ చెరువులు నిండు కుండలా ఉన్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు ఎడతెరప లేకుండా కురిసిన వర్షానికి మరో సారి వాగులు , వంకలు ,చెరువులు కుంటలు మత్తడి దూకుతున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News