నేటి సాక్షి, కరీంనగర్: కరీంనగర్లోని వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్నెక్ట్స్లో బుధవారం రెయిన్బో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణాన్ని వివిధ రంగు రంగుల వస్తువులతో చక్కగా అలంకరించి, పండుగ వాతావరణాన్ని తలిపించారు. చక్కటి ప్రదర్శనను కనబర్చిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వీ నరేందర్రెడ్డి హాజరై, మాట్లాడారు. ప్రాదమిక దశ విద్య చాలా ముఖ్యమైనదని, నిర్మాణాత్మకమైనదని పేర్కొన్నారు. విద్యార్థులకు సృజనాత్మకంగా విద్యనందించడానికై పాఠశాలలో వివిధ పద్ధతులను అమలుపరుస్తున్నట్లు చెప్పారు.
విద్యార్థుల్లో నూతనోత్తేజం కలుగుతుందని, విద్య నేర్చుకుందామని ఆసక్తి ఉంటుందని చెప్పారు. పాఠశాల విద్య ప్రణాళికలో భాగంగా సప్తవర్ణంలో విద్యార్థులకు రెయిన్బో గురించి చాలా గొప్పగా, చక్కగా బోధించడం జరిగినదని అన్నారు. ప్రత్యేకంగా చిన్నారులకు ఈ పద్ధతులు చాలా ఆమోదయోగంగా ఉండడమే కాకుండా వారు విషయాలను సులభంగా నేర్చుకుంటారని తెలిపారు. చిన్నారులు ప్రదర్శించిన ‘రెయిన్బో ఇజ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఓ రెయన్ ఓహో రెయన్’ నృత్యాలు చాలా ఆలోచింపచేశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.