నేటిసాక్షి,గన్నేరువరం:
మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముందస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం ఆదివారం రోజున నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి భారీ స్పందన లభించింది అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ లింగాల మల్లారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, రాజకీయంగా ఉన్నత పదవులు అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి బొడ్డు సునీల్, కాంగ్రెస్ నాయకులు నేలపట్ల కనకయ్య, సుధగోని మల్లేశం గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, తాళ్లపల్లి రవి గౌడ్, లింగంపల్లి హరీష్, బేతల్లి రాజేందర్ రెడ్డి, గొంటి సంతోష్, దుడ్డు మల్లేశం, ముసుకు కరుణాకర్ రెడ్డి, వంగల సత్యనారాయణ రెడ్డి, జంగిడి ప్రకాష్, బద్ధం సంపత్ రెడ్డి, పరిపూర్ణాచారి, సింగిరెడ్డి లక్ష్మీకాంత రెడ్డి, అధిక సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు గ్రామస్తులు పాల్గొన్నారు.

